
వీకెండ్ వస్తే థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే రోజుల నుంచి అసలు థియేటర్లు తెరుస్తారా? అన్న అనుమానంతో ఉండే రోజులకు వచ్చాము. కరోనా మొత్తం చిందరవందర చేసింది. ఇటువంటి సమయంలో ఎంటర్టైన్మెంట్ కి ఎవరికైనా టీవీలు, స్మార్ట్ ఫోన్లే దిక్కు. అందుకే అగ్ర నిర్మాతలు, దర్శకులు, నటి, నటీమణులు దీన్ని క్యాష్ చేసుకోవాలని డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టేసారు. ఇంకొంతమంది పెట్టబోతున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే "ఆహా" యాప్ కోసం ఓ షోను హోస్ట్ చేసేందుకు అంగీకరించిన తమన్నా, ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు కూడా సిద్ధమైంది. ఇది బహుభాషాల్లో తెరకెక్కనుంది. హిందీలో టీ సిరీస్ సంస్థ నిర్మిస్తుండగా, తెలుగులో UV క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.