
సినీ పరిశ్రమలో 14 ఏళ్లుగా ఉంటూ ఇటు తెలుగు ఇండస్ట్రీ అటు తమిళ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, క్రేజ్ సంపాదించుకుంది. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'సీటిమార్' చిత్రంలో నటిస్తుంది. అలానే తమిళ్ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధం అవుతుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం టాలెంటెడ్ హీరో సత్య దేవ్ తో కన్నడ రీమేక్ కోసం ఈ ముద్దుగుమ్మ జతకట్టనున్నట్లు తెలుస్తుంది. కన్నడలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'లవ్ మాకేటైల్' చిత్ర తెలుగు రీమేక్ లో ఈ ఇద్దరు నటించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.