
సోషల్ మెసేజ్ అందించే కథలతో సూపర్ హిట్లు కొడుతూ వచ్చిన డైరెక్టర్ కొరటాల శివ దర్శకతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికి 40% షూటింగ్ పూర్తి చేసుకోగా పరిస్థితులు సర్దుమనిగాక మళ్ళీ షూటిగ్ ను ప్రారంభించనున్నారు. తాజాగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇందులో 5 పాటలు ఉండబోతున్నట్లు, అవి కూడా బాసు గ్రెసు, స్టైల్ కు తగ్గట్టుగా ఉంటాయని తెలియజేసారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిరు సరసన కాలు షేక్ చేసేందుకు తమన్నాను తీసుకున్నట్లు తెలుసుతుంది. తమన్నా చిరుతో కలిసి సైరాలో నటించి మెప్పించిన విషయం విదితమే. మరి వీరి కాంబోలో స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.