
నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తల్లిదండ్రులకు కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ వార్తను సోషల్ మీడియా సైట్లలో మిల్కి బ్యూటీ స్వయంగా ధృవీకరించింది. తమన్నా మాట్లాడుతూ, ”నా తల్లిదండ్రులు వారాంతంలో తేలికపాటి కరోనావైరస్ లక్షణాలను చూపించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు, నా తల్లిదండ్రులకు కరోనావైరస్ పాజిటివ్ అని తెలింది. మేము దానికి అనుగుణంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాము. నాకు మరియు నా స్టాఫ్ సహా మిగిలిన కుటుంబ సభ్యులకు కోవిడ్ -19 నెగిటివ్ గా తెలిందని' చెప్పుకొచ్చారు. తనకు కరోనా నెగిటివ్ గా తేలిందని చెప్పిన తమన్నా ప్రతి ఒక్కరూ వారి ప్రార్థనలలో ఆమె తల్లిదండ్రులను ఉంచమని అభిమానులను అభ్యర్ధించారు.