
చాలా మంది ప్రముఖులు ప్రమాదకరమైన కరోనావైరస్ భారిన పడుతున్నారు. ఇప్పుడు,ఈ జాబితాలో తాజాగా మిల్కి బ్యూటీ తమన్నా భాటియా పేరుచేర్చబడింది. టాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియా కరోనావైరస్ 6పాజిటివ్ నిర్ధారించబడ్డారు. తాజా నివేదికల ప్రకారం, నటి హైదరాబాద్లో వెబ్ సిరీస్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఆమె కొన్ని లక్షణాలను చూపించింది. దీంతో వెంటనే ఆమె పరీక్షి చేయించుకోగా పాజిటివ్ అని తెలింది. తమన్నా ఇప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తమన్నా యొక్క అభిమానులు మరియు శ్రేయోభిలాషులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్విట్టర్లో పోస్ట్లు పెడుతున్నారు. బాహుబలి నటి తమన్నా తల్లిదండ్రులు నెల క్రితం కరోనా భారినపడి మొన్నీమధ్యే కోలుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే....గోపిచంద్, తమన్నా తెరకెక్కిన 'సిటిమార్' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇది కాక తమన్నా నటించిన ఓ హింది చిత్రం కూడా విడుదలకు వేచిచూస్తుంది.