
కన్నడ సూపర్ హిట్ చిత్రం 'లవ్ మాక్టైల్' తెలుగు రీమేక్ యువ నటుడు సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో తన నటనా ప్రతిభను చూప్పించాడు సత్యదేవ్. అతను నటించిన ఆ సినిమాకు సినీ విమర్శకుల నుంచే కాక చిరంజీవి లాంటి స్టార్ల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అందుకే సత్యదేవ్ ఇప్పుడు కధల విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఈనేపథ్యంలో ఈ రీమేక్ చిత్రంకి సైన్ చేసిన సత్యదేవ్ సరసన నటించేందుకు తమన్నా భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సత్యదేవ్ తో రొమాన్స్ చేసేందుకు మిల్కి బ్యూటీ అక్షరాల రూ.1 కోటి డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.