
ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన సూపర్ హిట్ చిత్రం అందాధున్ తెలుగులో రీమేక్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల మెర్లపాకా గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ రీమేక్ లోని తారాగణాన్ని ప్రకటించారు. నితిన్, నభా నటేష్ మరియు తమన్నా భాటియా ఆయుష్మాన్ ఖుర్రానా, రాధికా ఆప్టే మరియు టబుల పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు టబు పాత్ర ఎంతో కీలకం అందుకే పెద్ద పెద్ద స్టార్లను సంప్రదించి చివరికి తమన్నాకు ఫిక్స్ అయింది టీం. అయితే ఈ పాత్ర కోసం తమన్నాకు మేకర్స్ భారీగానే ముట్టచెబుతున్నారట. ఈ పాత్రకు గాను తమన్నాకు మేకర్స్ కోటిన్నర రూపాయిలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. మిల్కి బ్యూటీ కూడా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది.