
తాత గారి పాత్రలో తారక్ ? అభిమానులకు శుభవార్త
నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో తనదైన రీతిలో రాణిస్తున్నాడు జూ. ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో చారిత్రిక యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన నటించబోయేది ఎవారా అనే ఊహాగానాలకు కూడా చెక్ పెడుతూ హీరోయిన్ ను తాజాగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ పక్కన ఒలీవ మోరిస్ నటిస్తున్నట్లు చెప్పింది యూనిట్. ఇదిలా ఉంటె ఈమధ్యకాలంలో బయోపిక్ ల హావ నడుస్తుంది. ఈ నేపదలోనే తమిళ ప్రజలు అమ్మగా భావించే దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను ఏ.ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు. కంగనా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్ర కోసం అరవింద్ స్వామిను ఎంపిక చేసుకున్నారు. అయితే జయలలితే నందమూరి తారకరామారావుతో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అందుకనే ఎన్టీఆర్ పాత్ర కోసం బాలకృష్ణను సంప్రదించగా...ఇంకోసారి నాన్న గారి పాత్రలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపలేదట. దీంతో ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదినట్లు టాక్. ఎన్టీఆర్ కూడా సుముకంగా ఉన్నారట. ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే.