
బిగ్గెస్ట్ రియాల్టీ షో 'బిగ్ బాస్' తెలుగు ఇప్పటి వరకు మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. బిగ్ బాస్ మొదలైందంటేనే రోజు రాత్రి టివిలకు అతుక్కుపోతారు ప్రేక్షకులు. వాళ్ళ మధ్య వచ్చే గొడవలు, వీకెండ్ ఎలిమినేషన్లు, బిగ్ బాస్ టాస్క్‌లు, వారి నవ్వులు ఇలా అన్నిటిని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. ఈపాటికే మొదలవ్వాల్సిన షో కరోనా కారణంగా ఆలస్యం అయింది. ఇక మొన్న టీజర్ రావటంతో షోలోని కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో చర్చ, రచ్చ మొదలయ్యాయి. అయితే ఈ నేపధ్యంలో ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ బిగ్ బాస్ లోకి వెళ్లనున్నాడనే వార్త వైరల్ అవ్వటంతో తరుణ్ స్పందించక తప్పలేదు. 'నేను ఏ షోకు వెళ్ళటం లేదు. నాకు ఆ షో పైన కానీ అందులోకి వెళ్లాలని కానీ ఆసక్తి లేదని' తేల్చి చెప్పేసాడు. దీంతో ఇది ఊహించిన సోషల్ మీడియా డిటెక్టివులు చల్లపడ్డారు.