
తెలుగు ఇండస్ట్రీలో పేరున్న దర్శకుల్లో తేజ ఒకరు. ఎన్ని ప్లాప్స్ వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్, గుర్తింపు ఉండటంతో ఇప్పటికి అతని సినిమా వస్తుందంటే ఆసక్తి చూపుతారు ప్రేక్షకులు. ఎంతోకాలం తర్వాత రానా హీరోగా తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రితో మంచి హిట్ అందుకున్న తేజ అదే జోష్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ తో తెరకెక్కించిన సీత బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కధ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఎక్కువ సందేశాత్మక కధలను ఎంచుకునే తేజ ఈసారి కూడా అదే చేస్తున్నట్లు తెలుస్తోంది. తేజ ఆర్టికల్ 370 రద్దు అంశంపై చిత్రం తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు ఎన్ని సంచలనాలకు తెర లేపిందో తెలిసిన విషయమే. అందుకే ఈ కధ అయితే బాగుంటుందని అందులో గోపిచంద్ హీరోగా చేస్తే సెట్ అవుతుందని భావిస్తున్నాడట. గోపి చంద్ కూడా ప్లాపుల్లో ఉన్న కారణంగా ఈ కధపై మొగ్గుచూపుతున్నారట.