
'ట్వీట్లు' సరిగ్గా లేనట్లయితే, అభిమానులతో సెలెబ్రిటీలు, ప్రజలతో ప్రభుత్వ అధికారులు మాట్లాడినా మరియు వివిధ రకాల విషయాలపై ప్రజల రియాక్షన్ అంతుపట్టలేము. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. హీరోయిన్ రష్మిక మందన్న గ్లామరస్ చిత్రాలపై తెలంగాణకు చెందిన జగిత్యాల్ జిల్లా కలెక్టర్ కామెంట్ చేయటంతో నెటిజన్ల రియాక్షన్ ఎదురుకోక తప్పలేదు. నిన్న, హీరోయిన్ రష్మిక 'భీష్మ' ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఆకుపచ్చ రంగు దుస్తులలో కనిపించింది, తరువాత ఆమె ఆ చిత్రాలను అధికారిక ట్విట్టర్ పేజీలో కూడా పోస్ట్ చేసింది. ఆమె పెట్టిన ట్వీట్ పై తెలంగాణ జగిత్యాల్ కలెక్టర్ హ్యాండిల్ నుండి "చిన్చావ్ పో రష్మిక" అంటూ కామెంట్ వచ్చింది. ఈ కామెంట్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. కలెక్టర్ తన హోదాను మార్చి ఇలాంటి కామెంట్ పెట్టడమేంటంటూ విమర్శించారు. ఆ తరువాత కలెక్టర్ "నా అకౌంట్ హ్యాక్ అయింది" అని క్లారిటీ ఇచ్చారు. ఆఫీస్ లో ఒక ఉద్యోగి తన అకౌంట్ ను హ్యాండిల్ చేస్తున్నాడని వివరణ ఇచ్చారు.