
నాగార్జున అక్కినేని హోస్ట్ చేయనున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 త్వరలో ప్రసారం కానుంది. పదహారు మంది పోటీదారులు బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశిస్తారని, వారందరినీ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హోటల్లో క్వారెంటైన్ లో ఉంచినట్లు సమాచారం. అయితే తాజా ప్రచారం నిజమైతే, ముందుజాగ్రత్త చర్యగా ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే వారి స్థానంలో వెళ్లేందుకు 5-6 అదనపు పోటీదారులు కూడా వరుసలో ఉంచారట. అందులో భాగంగా, పాపులర్ తెలుగు సీరియల్ 'ముద్దా మందరం' ఫేమ్ లీడ్ నటి, తనూజా గౌడను ఎంపిక చేశారట. ప్రస్తుతం ఆమె ఇతర పోటీదారులతో పాటు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో క్వారెంటైన్ లో ఉంది.