
'అపూర్వ శ్రీనివాసన్' సుప్రసిద్ధ మోడల్ మరియు నటి. 2012 లో హైదరాబాద్ టైమ్స్ ఫ్రెష్ పోటీలో విజయం సాధించిన తర్వాత ఆమె లైమ్ లైట్లలోకి వచ్చింది. ఆ తర్వాత, సినిమాల్లో నటించమని ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. మొదట్లో అపూర్వా నటన పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. కాస్టింగ్ టీం నుండి కాల్స్ వచ్చిన తరువాత ఆమె తల్లి అపూర్వను నటించేందుకు ప్రేరేపించింది. అప్పుడు, ఆమె చివరకు పూరి జగన్నాధ్ చిత్రం 'టెంపర్' లో ఒక పాత్రను పోషించింది. ఆమె తెలుగు చిత్ర ఇండస్ట్రీలో టెంపర్ ద్వారా అడుగుపెట్టింది. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, అపూర్వ శ్రీనివాసన్ పైలట్ అయ్యారు. అపుర్వ శ్రీనివాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దుండిగల్ ఎయిర్‌బేస్ నుంచి హైదరాబాద్ కు దూసుకుపోయిన విమానాన్ని నడిపి, తన మొదటి సోలో రైడ్‌ను ఏంజయ్ చేసినట్లు వెల్లడించింది.