
సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు. భారత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు. మహేష్ తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో అనేక రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ సినిమా మొదటి వారంలో 100 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలిపారు. హాలిడేస్ కలిసి రావటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన పరుగులు సాధించింది. ఈ రోజు నుండి వచ్చే వసూళ్లు సినిమా లాభాల్లో ఉంది లేనిది నిర్ణయిస్తుంది. ఇప్పటికే బయర్స్ ఎక్కువమంది సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. మహేష్ కెరియర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాల్లో మహర్షి ఒకటి. అయితే అలాంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో మహేష్ మరో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ వెల్లడించాడు. తాజా సమాచారం ప్రకారం మహేష్ - వంశీ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. థమన్ కు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ అందించనున్నాడు.