
డిజిటల్ వేదికల పై మక్కువ ప్రదర్శిస్తున్న తారల జాబితా రోజు రోజుకీ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ డిజిటల్ మీడియా కంపెనీలు అయినా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లు ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఒరిజినల్ కంటెంట్ ను ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ముఖ్యంగా వెబ్సిరీస్లకి సినిమాల స్థాయిలో ఆదరణ లభిస్తుండడంతో వాటిలో నటించేందుకు అగ్ర తారలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే అక్కినేని సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ లో నటిస్తున్నట్లుగా తెలిపింది. అలానే కాజల్ అగర్వాల్ సైతం వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందిస్తున్న వెబ్‌సిరీస్ లో నటించేందుకు ఒప్పుకుందని సమాచారం. అదే వరసలో తమన్నా చేరి తాను చేస్తున్న 'ది నవంబర్ స్టొరీ' వెబ్ సిరీస్ లో తమన్నా...తండ్రి పరువుని కాపాడే కూతురు పాత్రలో నటించబోతుంది. తనలోని నటిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ప్రయత్నమిదని చెప్పింది తమన్నా.