
మెగా బ్రదర్ నాగబాబు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోను వీడిన సంగతి తెలిసిందే. నిన్నటితో జబర్దస్త్ తో నాగబాబు అనుబంధం ముగిసింది. కొద్దిరోజుల్లో జీతెలుగు లో ప్రసారంకాబోతున్న కొత్త కామెడీ షో లో కనిపించనున్నారు. నాగబాబు వెళ్తూ వెళ్తూ జబర్దస్త్ నుంచి కొంతమందిని కూడా తీసుకెళ్లాడు. అయితే కేవలం బిజినెస్ ఐడియాలజీ కుదరకనే షో నుంచి తప్పుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఇకపోతే ఆయన నవ్వులతో నడిచిన షోను ఆయన లేకుండా ముందుకు ఎలా తీసుకెళ్లాలి ? ఎవరిని తీసుకొస్తే బాగుంటుందని భావించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికోసం డైలాగ్ కింగ్ సాయికుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇప్పటికే ఐటీవీలో పలు రియాల్టీ షోలు చేస్తున్న సాయికుమార్ జబర్దస్త్ లో కనిపించడం ఖాయం అయినట్లు సమాచారం. అలానే కమెడియన్ అలీతో కూడా మరో జడ్జి కోసం సంప్రదింపులు జరుగుతున్నారట. వీరిలో ఎవరైనా రాని పక్షంలో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ వచ్చేట్లు ప్లాన్ చేస్తున్నారట.