
వెంకటేష్ 74 వ చిత్రం యొక్క లుక్ పోస్టర్ఈ రోజు ట్విట్టర్లో నటుడు వెంకటేష్ స్వయంగా వెల్లడించారు. వెంకటేష్ తన ట్విట్టర్లో ఈ చిత్రానికి నారప్ప అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే...నారప్ప యొక్క లుక్ పోస్టర్ లో వెంకటేష్ కఠినమైన మరియు మోటైన అవతారంలో...అతని చేతిలో రక్తపు మరక కొడవలితో టెర్రిఫిక్ గా కనిపిస్తున్నాడు. వెంకటేష్ నారప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అతని అభిమానుల నుండి సానుకూల స్పందన మరియు సినీ ప్రేక్షకుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళంలో కులాల ఆధారంగా వెట్రిమరన్ దర్శకత్వం వహించిన అసూరన్ కు భారీ ఆదరణ లభించడమే కాకుండా హీరో ధనుష్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు తెలుగులో ఆ సినిమా రీమేక్ "నారప్ప" ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.