
విజయ్ దేవరకొండ, రష్మీక మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం "గీత గోవిందం" ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ పరుశురాం తదుపరి చిత్రంపై రోజుకో పుకారు పుట్టుకొచ్చింది. విజయ్ దేవరకొండ తర్వాత కచ్చితంగా పెద్ద హీరోతోనే చేయాలని ఫిక్స్ అయ్యి కధ రెడీగా ఉన్నా స్టార్ హీరోల డేట్ల కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ చుట్టూ తిరిగిన పరుశురాం ఇక వాళ్ళ డేట్లు ఇప్పట్లో కష్టమని అర్థమై వేరే హీరోకి షిఫ్ట్ అయ్యాడు. అతను మరెవరో కాదు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య. స్టార్ హీరో అనుకోని మీడియం హీరోకి ఫిక్స్ అయిన పరుశురాం గీత గోవిందం అంత రేంజ్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఇకపోతే నాగచైతన్య రియల్ లైఫ్ మామ వెంకటేష్ తో కలిసి నటించిన "వెంకీ మామ" నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరోపక్క శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీలో నటిస్తున్నాడు.