
యువ మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ బాక్సింగ్ ఆధారిత చిత్రం చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల వైజాగ్‌లో ప్రారంభమైంది, మొదటి షెడ్యూల్ జరుగుతోంది. వరుణ్ తేజ్ బాక్సింగ్‌లో శిక్షణ పొందడానికి అలానే పాత్రకు తగినట్లుగా ఫిజిక్ కోసం దాదాపు నాలుగు నెలలు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. అతని కృషి మరియు అంకితభావం ఈ చిత్రానికి భారీ ప్లస్ అవుతుందని టీం భావిస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన నవీన్ చంద్ర ఈ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నాడు. నవీన్ చంద్ర ఇటీవల ఎన్టీఆర్ నటించిన అరవింద సమేతలో విలన్ గా నటించారు. ఎవరు చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ రెండు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు నవీన్ చంద్ర, వరుణ్ తేజ్ తో బాక్సింగ్ రింగ్ లో పోటీ పడబోతున్నాడు. వరుణ్ తేజ్ ను మ్యాచ్ చేసేందుకు నవీన్ కాస్త బాడీ కూడా బిల్డ్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు.