
మెగాస్టార్ కొత్త ఇల్లు ప్రత్యేకత తెలిసితే కంగుతినాల్సిందే
మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లో 25వేల చదరపు అడుగుల్లో కొత్త ఇల్లు కట్టించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటి కోసం చిరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఎంతో ఇష్టంగా నిర్మిస్తున్న ఈ భవనం మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. అయితే ఇంటి ఇంటిరియర్స్ ను స్పెషల్ గా డిజైన్ చెపిస్తున్నట్లు భవంతికి డిజైన్ అండ్ ప్లానింగ్ చేసిన తహిలియానీ హోమ్స్ నిర్వాహకుల్లో ఒకరైన జహన్ తహిలియానీ చెప్పారు. హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా డిజైన్ చేస్తున్నారట. పెద్ద గదులు, ముఖ్యంగా బెడ్ రూమ్స్ ను బంగారు ఆభరణాలకు ఉపయోగించే పచ్చరాళ్లను వాడి ఇంటిరియర్స్ చెపిస్తున్నారట. కాస్ట్లీ వస్తువులను పొందుపరుస్తున్నారట. ఇంటి పనులను రామ్ చరణ్, ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంటి గృహప్రవేశనికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సైరా నరసింహారెడ్డి సక్సెస్ ఇచ్చిన జోష్ తో కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమా మొదలు పెట్టేసారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నారు.