
నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి మరోసారి జతకట్టబోతున్నారని తాజాగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి ముందు 'ఎంసిఏ'లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత, మళ్ళీ ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ లో కనిపించబోతున్నారు. నాని 'వి' షూట్ ఇప్పటికే పూర్తి కాగా...చిత్రాన్ని ఉగాదికు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల చిత్రం యొక్క ప్రమోషన్లు కిక్-స్టార్ట్ అయ్యాయి. ఇక నాని తన తదుపరి చిత్రం, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టక్ జగదీష్' షూటింగ్ ప్రారంభించాడు. శివ నిర్వాణ-నాని కాంబోలో వచ్చిన 'నిన్ను కోరి' సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు కాకుండా నాని 'టాక్సీవాలా' డైరెక్టర్ తో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు సంకిత్ర్యన్ సాయి పల్లవిని సంప్రదించిన్నట్లు సమాచారం. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే...నాని, పల్లవి కాంబోలో రెండో సినిమా అవుతుంది.