
గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడిందని పెద్ద స్థాయిలో చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పెద్ద బడ్జెట్ ఎంటర్టైనర్ 'కెజిఎఫ్2' ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను దక్కించుకుందని అనేక ఉహాగానాలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం వరకు జూలై 30 ఆర్ఆర్ఆర్ విడుదల తేదీగా చెప్పబడుతుండటం అందరికీ తెలిసిందే. కానీ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు గాయపడటంతో, షెడ్యూల్లను ప్రభావితం చేసింది, ఫలితంగా షూట్ ఆలస్యం అయింది. అంతేకాకుండా, ఆర్ఆర్ఆర్ 10 భాషలలో విడుదల కానుంది, సినిమా కోసం చాలా విఎఫ్ఎక్స్ అవసరం. ఇప్పటి వరకు షూట్ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఆర్ఆర్ఆర్ బృందం సినిమాను వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించింది. వారు కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ ను 2021 జనవరి 8న సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నందున, ఆర్ఆర్ఆర్ పోటీలో ఏ చిత్రం వస్తుందో ఆసక్తికరంగా మారింది.