
ఆర్ ఎక్స్100 ఫెమ్ కార్తికేయ కెరియర్ అనుకుంత సాఫీగా సాగట్లేదు. దీంతో అందరూ అప్పుడు లక్ కలిసొచ్చింది కాబట్టి హిట్ వచ్చిందని లేకపోతే అంత సిన్ లేదంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాలని ఎన్ని ప్లాప్స్ ఎదురైన హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం కార్తికేయ నటించిన '90ML' డిసెంబర్ 5న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తే హీరో లీగల్ గా రోజుకు 90ML మద్యం సేవించొచ్చని అర్ధం అవుతుంది. లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ ఆ సినిమాకు సెన్సార్ కష్టాలు తప్పట్లేదు. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ కొన్ని సిన్లు, డైలాగ్స్ కట్ చేయమని చెప్పిందట. అవి చేస్తే కానీ సర్టిఫికెట్ లభించిందని చెప్పడంతో చేసేదేమీ లేకా కట్ చేసే పనిలో పడ్డారట. కానీ రిలీజ్ కు కేవలం ఒక్క రోజే సమయం ఉంది. మరి ఈ గ్యాప్ లో చేసి రిలీజ్ చేయ్యగలరా లేదా అనేది చూడాలి.