
గోవా బ్యూటీ ఇలియానా నడుము అందాలతో ఒకప్పుడు కుర్రకారు మతిపోగొట్టేసింది. ఆమె అందాలను చూస్తూ ఉండిపోయే వాళ్లంటే అతిశయోక్తి కాదు. కెరియర్ బాగుంది. దక్షిణాదిలో ఇక ఇలియానాకు తిరుగు లేదని అంతా భావించిన సమయంలో ఆమె బాలీవుడ్ కు జంప్ అయ్యి అక్కడ సినిమాలు చేయటం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఇలియానాకు కాలం కలిసి రాలేదు. చెప్పుకోదగ్గ హిట్లు లేకపోవడంతో డీలా పడింది. దక్షిణాదిలో చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు మరోపక్క బాలీవుడ్ లో వస్తున్న ఒకటి రెండు సినిమాలు చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. ఆమె నటించిన తాజా చిత్రం పాగల్ పంతి. అయితే ఇలియానాకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ తో నటించిన "రైడ్" సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో రైడ్ కు సిక్వెల్ తియ్యాలని అజయ్ దేవగన్ ఫిక్స్ అయ్యాడట. అందులో కూడా ఇలియానానే హీరోయిన్ గా నటించాలని అజయ్ అనడంతో టీం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ మేరకు ఇలియానాకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.