
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం "అల..వైకుంఠపురంలో". సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. మొదట అదే రోజున మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే నష్టాలు వస్తాయని భావించి మహేష్ సినిమా ఒక రోజు ముందుకు జరిగింది. అయితే రెండు సినిమాలవి రిలీజ్ డేట్లు దగ్గర పడటంతో ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మహేష్ చిత్ర ఈవెంట్ జనవరి 5న నిర్వహించనుంది. అల...వైకుంఠపురంలో చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా అదే రోజు జరగాల్సి ఉంది. కానీ ఒకే రోజు రెండు ఈవెంట్లు పెట్టడం సరికాదని భావించి ఈసారి అల...వైకుంఠపురంలో టీం ఒక రోజు వెనక్కి జరిగి జనవరి 6న ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనుంది. మరి అల..వైకుంఠపురంలో ఈవెంట్ కుఅతిధిగా ఎవరు వస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.