
నాగ్ నటించిన తాజా చిత్రం "మన్మధుడు2" బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. నాగ్ వయసుకు ఆ రొమాన్స్ ఏంటంటూ విమర్శలు వినిపించాయి. దీంతో అలాంటి పాత్రలకు కాస్త గ్యాప్ ఇచ్చి సందేశాత్మక చిత్రంలో నటించాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు నూతన దర్శకుడు అహితోష్ సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వైల్డ్ డాగ్" లో హీరోగా నటిస్తున్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఎన్ ఐ ఏ అధికారిగా నాగార్జున నటిస్తున్నారు. సరికొత్త పద్దతిలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే ఇద్దరి హీరోయిన్లను అడగగా...వారు రిజెక్ట్ చేశారట. నాగ్ తో నటించేందుకు మొగ్గుచూపక నో చెప్పారో..లేదా పాత్ర, రెమ్యునరేషన్ నచ్చక చెప్పారో తెలీదు కానీ... ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారట.