
అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా "అల...వైకుంఠపురంలో". మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్ల్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయి వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్లినా, ఏ ఫంక్షన్లో చూసినా ఈ సినిమా పాటలే వినపడుతున్నాయి. అయితే నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్ లో చిత్ర మ్యూజిక్ దర్శకుడు థమన్ మాట్లాడుతూ..."ఒక్క పాట కాదు ఆల్బమ్ మొత్తం ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం నాకు అల్లు అర్జున్ మీదున్న ప్రేమని. మీలానే నేను కూడా అల్లు అర్జున్ కు అభిమానిని. అందుకే ప్రేమతో ఇంత మంచి ఆల్బమ్ ఇవ్వగలిగానని" చెప్పారు.