
ఆంధ్రప్రదేశ్ లో చలికాలం అసెంబ్లీ సమావేశాలు చాలా వేడి వేడిగా సాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైకాపా ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ కాపిటల్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంరేపుతున్నాయి. మూడు జిల్లాలను కవర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు మూడు కాపిటల్ సిటీలు ఉండటంలో తప్పు లేదని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉత్తర ఆంధ్రాను కవర్ చేస్తూ విశాఖపట్నం, సెంట్రల్ ఆంధ్రాలో అమరావతి, రాయలసీమ చిహ్నంగా కర్నూల్ ఇలా ఆంధ్రప్రదేశ్ కు మూడు కాపీటల్స్ తీసుకొచ్చే పనిలో ఉన్నామని జగన్ తెలిపారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ "మనకి కూడా సౌత్ ఆఫ్రికా లాగా మూడు కాపీటల్స్ ఉండొచ్చు. దీనికి సంబంధించిన కమిటీ వారం రోజుల్లో ఒక రిపోర్ట్ ను సిద్ధం చేస్తుందని...దానిబట్టి నిర్ణయం తీసుకుంటామని" తెలిపారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.