
సీనియర్ స్టార్స్ నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తమ షూట్లను ఇప్పుడే తిరిగి ప్రారంభించకూడదని, మరికొన్ని రోజులకు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ముగ్గురు సీనియర్ హీరోలు దసరా తరువాత తమ సినిమాలను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం హైదరాబాద్, చెన్నైలలో భారీ వర్షాలు కురవడంతో షూటింగ్ అప్పుడే మొదలుపెట్టడం కష్టమని కాబట్టి ముగ్గురు హీరోలు తమ సినిమాలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య'లో నటిస్తున్నారు. కొరటాల దసరాకు షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసినప్పటికి పరిస్థితుల దృశ్య వాయిదా వేయాల్సి వచ్చింది. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న 'నారప్ప' షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఇక బాలకృష్ణ బోయపాటి నేతృత్వంలో ఓ సినిమా సైన్ చేశారు మరి అది సెట్స్ పైకి ఎప్పటికి వెళ్తుందో చూడాలి.