
సినీ, రాజకీయాల్లో వారసుల రంగప్రవేశం సర్వ సాధారణం. వారి ఎంట్రీ కోసం జరిగే హంగామా అంతా ఇంతా కాదు. బరిలోకి దిగేముందు అన్నిటికి సిద్ధమై దిగుతారు. ఇక మరి ముఖ్యంగా సినీ పరిశ్రమలోకి వచ్చే ముందు సక్సెస్ కి, ఫెయిల్యూర్ కి సిద్ధ పడాల్సి ఉంటుంది. అయితే సినీ రంగంలో వారసులుగా ఎక్కువ హీరోలు రావటం చూసాం కానీ హీరోయిన్లు తక్కువే. మంచు లక్ష్మి, మెగా డాటర్ నిహారిక మినహా వారసురాలుగా వచ్చిన హీరోయిన్లు తక్కువే. అయితే ఇప్పుడు తన వారసురాలిగా తెలుగు తెరకు తన కూతురు ఐశ్వర్యను పరిచయం చేస్తున్నాడు యాక్షన్ కింగ్ అర్జున్. హీరోయిన్ కు ఉండాల్సిన గ్లామర్, హావభావాలు అన్ని ఆమెలో ఉన్నాయి. తమిళ్, కన్నడలో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యకు సక్సెస్ రాలేదు. దీంతో తెలుగులో లక్ పరీక్షించుకునేందుకు రెడీ అవుతుంది. ఐశ్వర్య తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్న సినిమాకు స్వయంగా అర్జునే దర్శకత్వం వహించడం విశేషం.