
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మన దేశాన్ని కూడా ఎంతలా కుదిపేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమపై కోలుకోలేని దెబ్బ పడింది. కోట్లలో రెవెన్యూ చేసే సినిమాలు ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్దకు రాకపోవడంతో ఎంతోమంది నష్టపోయారు. 8 నెలల తర్వాత మళ్ళీ కొంతవరకు అన్ని మొదలయ్యాయి, షూటింగ్ లు జరుపుతున్న దర్శక నిర్మాతలకు హీరోలకు మళ్ళీ ఎదురుదెబ్బ తగలనుంది. విదేశాల్లో షూటింగ్ జరిపేందుకు ఎదురుచూస్తున్న వారికీ అది ఇప్పట్లో సాధ్యం కాదని పరిస్థితులు చెబుతున్నాయి. విదేశాల్లో కొత్త రకమైన స్ట్రెయిన్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుతందని మన దేశం కూడా అప్రమత్తమయ్యి రాకపోకలను నిలిపివేశారు. దీంతో విదేశాల్లో షూటింగ్ నిర్వహిద్దామని అనుకున్న వారికీ ఎప్పటికి అవుతుందో చెప్పలేని పరిస్థితి.
Tags: #Cinecolorz #Corona #Tollywood