
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటుస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి లాంటి రికార్డ్ బ్రేకింగ్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందులో ఇద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు రామ్ చరణ్- అలియా మధ్య ఒక పాటను చిత్రికరిస్తున్నారట. ఈ పాట కోసం స్పెషల్ గా ఒక సెట్ కూడా వేశారట. చారిత్రిక నేపథ్యంలో సాగే ఈ కధలో ఎలాంటి పాట ఉండబోతుంది? రామ్-అలియా ఎలాంటి స్టెప్పులు వెయ్యనున్నారనే ఆసక్తి నెలకుంది. ఇకపోతే కొద్దిరోజులకు ముందే ఎన్టీఆర్ సరసన ఒలివియా అనే బ్రిటిష్ భామను ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించారు.