
హైదరాబాద్ ను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. తగ్గుతున్నట్టే తగ్గి మళ్ళీ తిరగబడుతున్నాయి. భాగ్యనగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లో సైతం నీళ్లు నిలిచిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పితే ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇకపోతే కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ ను వణికిస్తున్న ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వంకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ సినీ సెలెబ్రెటీలు ముందుకొచ్చారు. ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారో చూడండి:
మహేష్ బాబు- రూ.1 కోటి
నాగార్జున- రూ.50 లక్షలు
చిరంజీవి- రూ.1 కోటి
విజయ్ దేవరకొండ- రూ.10 లక్షలు
జూ. ఎన్టీఆర్- రూ.50 లక్షలు
హరీష్ శంకర్- రూ.5 లక్షలు
అనిల్ రావిపూడి- రూ.5 లక్షలు
రామ్ పోతినేని- రూ.25 లక్షలు
త్రివిక్రమ్- రూ.10 లక్షలు