
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్ లో నితిన్ పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒక తెలుగు అమ్మాయిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడని ఆమెను ఈ ఏడాది ఏప్రిల్ లో దుబాయిలో పెళ్లి చేసుకోనున్నాడని జోరుగా వినిపిస్తుంది. అయితే నితిన్ ప్రేమిస్తున్న అమ్మాయి సినీ ఇండస్ట్రీకి చెందినామే కాదు. నితిన్ పెళ్లాడనున్న ఆ అమ్మాయి పేరు షాలిని అని సమాచారం. యూకేలో ఎంబీఏ పూర్తి చేసిన షాలినితో నితిన్ గత నాలుగు ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడని....పెద్దల అనుమతితో ఏప్రిల్ లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిసిందే. నితిన్ అభిమానులకు శుభవార్త. యువ నటుడు నితిన్, అతని ప్రియురాలు షాలినిల నిశ్చితార్థం రేపు, ఫిబ్రవరి 15న హైదరాబాద్ లో జరగనుంది. నితిన్ మరియు షాలినిల నిశ్చితార్థ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరుకానున్నారు. వీరి వివాహం ఏప్రిల్ 16న దుబాయ్లో జరుగుతుంది. ప్రస్తుతం రెండు కుటుంబాలు వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాయి.