
సౌత్ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొంది పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నటించిన నటి త్రిష. అభిమానులు, ప్రేక్షకులు అందరూ ఇమే పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరిని చేసుకుంటుంది?ఎప్పుడు చేసుకుంటుందని ఆశగా చూస్తున్నారు. ఆ మధ్య ఓ వ్యాపారవేత్తతో త్రిషకు నిశ్చితార్థం అయ్యి మనస్పర్థలు రావటంతో విడిపోయారు. ఆ తరువాత ఆమె వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఆమె పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ అయింది. తాజగా ఆమె కాంట్రావర్షియల్ తమిళ్ హీరో శింబును ఆమె పెళ్లి చేసుకొనున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అందరూ దీన్ని కొట్టిపడేసినా త్రిష, శింబు మాత్రం దీనిపై స్పందించలేదు. దీనితో ఈ రూమర్ ఇంకా బలపడింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వాళ్ళు నోరు విప్పితే కానీ తెలీదు.