
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలి రాజకీయాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇకపై ప్రజలతోనే తన ప్రయాణం అంటూ ప్రకటించిన పవన్ కొన్ని కారణాల వల్ల మళ్ళీ మేకప్ వేసుకునేందుకు సిద్ధం అయ్యారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "పింక్" సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేయనున్నారు. తాజాగా దిల్ రాజు ఆఫీస్ లో సినిమా ప్రారంభం అయింది. జనవరిలో రెగులర్ షూటింగ్ మొదలు కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంకు థమన్ సంగీతం అందిస్తున్నారు. మొన్నీమధ్య మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ ను కలిసిన విషయం తెలిసిందే. అయితే తన సినిమా అల...వైకుంఠపురంలో ను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో...పవన్ తో మీటింగ్ పై క్లారిటీ ఇచ్చాడు. "నేను పింక్ రీమేక్ కి డైలాగ్స్ రాయటం లేదు. ఆ సినిమాకు పని చేయట్లేదు. సినిమాకు సంబంధించిన మీటింగ్ లో పాల్గొని..పవన్, దిల్ రాజుతో పింక్ సినిమాను వీక్షించానని" అని తెలిపారు.