
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్ ఉందో కొంతమంది దర్శకులకు కూడా అంతే స్థాయిలో గుర్తింపు, క్రేజ్ ఉంది. ఆ జాబితాలో టాప్ లో దర్శక దిగ్గజం రాజమౌళి ఉంటే, ఆ తర్వాతి స్థానంలో త్రివిక్రమ్ ఉంటారు. మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నిజంగానే త్రివిక్రమ్ మాటలతో మ్యాజిక్ చేస్తాడు. అతని డైలాగ్స్ తో జీవితం అంటే ఏంటో చెప్తూ, బంధాల విలువ నేర్పుతూ, కడుపుబ్బా నవ్వించడం ఆయన స్టైల్. అందుకే త్రివిక్రమ్ ను గురూజీ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'అల...వైకుంఠపురంలో' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో చిత్రానికి సంబంధించిన కట్ ఔట్స్ అప్పుడే తెలుగు రాష్ట్రాలలో దర్శనమిస్తున్నాయి. ఐతే ఆశ్చర్యకరంగా బన్నీ భారీ కట్ ఔట్ పక్కనే త్రివిక్రమ్ కట్ ఔట్ కనిపించడం ఆసక్తి రేపుతోంది.ఇది చూసిన త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఫిదా ఐపోతున్నారు. ఇది త్రివిక్రమ్ క్రేజ్ కీ నిదర్శనం అని చెప్పక తప్పదు.