
టాలీవుడ్ లో ఈ జెనరేషన్ లో బెస్ట్ కాంబోల విషయానికొస్తే మొదట వినిపించే పేర్లు పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ డైలాగ్స్ కి పవన్ మ్యానరిజమ్స్ తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందేనని బలంగా నమ్ముతారు, అది చాలా సార్లు నిజమైంది కూడా. అయితే కేవలం సినిమాల వరకే కాకుండా ఈ ఇద్దరు మంచి మిత్రులన్న విషయం అందరికి తెలిసిందే. అదే సాన్నిహిత్యంతో పవన్ సినిమాల ఎంపిక విషయంలో త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుందని రూమర్ కూడా ఉంది. తాజాగా ఆ రూమర్ మళ్ళీ బలపడింది. అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ త్రివిక్రమ్ సెట్ చేశారట. పెద్దగా అనుభవం లేని దర్శకుడు సాగర్ ఎలా తీస్తాడు అన్న ప్రశ్న నెటిజన్లతో పాటు నిర్మాతలకు వచ్చిందట. అయితే ఈ స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ దగ్గరుండి సెట్ చేసినట్లు తెలుస్తుంది. అందుకే నమ్మకంగా అందరూ ముందుకొచ్చారని సమాచారం. కానీ ఇది బయటకు రాకుండా చూసుకుంటున్నాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ కావాలనే జారుకున్నాడా లేదా పవన్ కు ప్రతి సారి త్రివిక్రమ్ హెల్ప్ చేయడం అలవటయ్యిందనే ముద్ర పడకూడదని అలా చేశాడా అనేది హాట్ టాపిక్ గా మారింది.