
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన త్రివిక్రమ్ తాజా చిత్రం "అల..వైకుంఠపురములో" బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అల వైకుంఠపురములో చిత్రం అనేక ప్రాంతాలలో బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది మరియు తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ తన తదుపరి సినిమా కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను లాక్ చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వెంచర్ ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు సన్నిహిత వర్గాలు వెల్లడించన దాని ప్రకారం, దర్శకుడికి అనేక ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నాయి. కాని వాటిని సినిమాల్లోకి తీసుకురావడానికి అతనికి టైం లేదు. కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తగా వచ్చిన వారితో చిన్న సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. హరిక మరియు హాసిన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్న ఈ చిన్న చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాసే స్వయంగా స్క్రిప్ట్ రాయనున్నారు. ఒక కొత్త డైరెక్టర్ తో కొత్త హీరోతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అతి త్వరలో ఈ చిన్న చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.