
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి మధ్య ఉన్న స్నేహం చూసి అభిమానులు సంబరపడుతుంటారు. వీరి కాంబోలో వచ్చిన జల్సా సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే వచ్చిన అత్తారింటికి దారేది రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత వచ్చిన ఆజ్ఞతవాసి డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ ఈ ఇద్దరి కలయికలో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్ విజయవాడలో పవన్ ను కలవడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక పవన్ రీఎంట్రీ ఖాయమని తెలుస్తుండటంతో విజయవాడలో పవన్ ను కధ చెప్పేందుకు త్రివిక్రమ్ కలిశారా అంటూ అనుమానాలు రేగుతున్నాయి. మరోపక్క త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అల...వైకుంఠపురంలో ప్రి రిలీజ్ ఈవెంట్ కు రమ్మని ఆడిగేందుకు కలిసుంటారని ఊహాగానాలు వినపడుతున్నాయి.