
తాజాగా అల్లు అర్జున్ హీరోగా 'అల..వైకుంఠపురంలో' సినిమా తెరకెక్కించి బహుబలియేతర ఆల్ టైం హిట్ కొట్టారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే త్రివిక్రమ్ ఎప్పుడు రీమేక్ లు చేసిన జాడ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా రీమేక్ బాట పట్టబోతున్నారట. మలయాళం బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనమ్ కోషియం' విడుదలైనప్పటి నుండి హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ అనేక భాషలలో రీమేక్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ మరియు కోలీవుడ్ యొక్క రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. తెలుగు వెర్షన్ కోసం సీతారా ఎంటర్టైన్మెంట్స్ హక్కులను దక్కించుకుంది. ఈగోస్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు తగిన ఇద్దరు హీరోల కోసం వారు వెతుకుతున్నారు. మొదట, రవితేజ మరియు రానా దగ్గుబాటిలను ఆ పాత్రల కోసం పరిశీలించారు. తరువాత ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు. ఒక లిడ్ లో చేసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మొదట వేరే నూతన దర్శకుడిని అనుకున్నప్పటికి పవన్ కళ్యాణ్ ఫ్రెమ్ లోకి రావటంతో త్రివిక్రమ్ అయితే సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారట. మరి త్రివిక్రమ్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.