
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన 'అల..వైకుంఠపురంలో' సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా మొదలుపెట్టారు. అయితే ఎన్టీఆర్ RRR లో బిజీగా ఉండటంతో కథపై ఫోకస్ పెట్టిన త్రివిక్రమ్ ఆ తరువాత ప్రాజెక్ట్ కోసం కూడా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ తియ్యాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే త్రివిక్రమ్ సినిమాలు గమనిస్తే ఇప్పటి వరకు కేవలం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, నితిన్ తో మాత్రమే తీశారు. ఇక ఇప్పుడు తన హీరోను మార్చిన మాటల మాంత్రికుడు సినిమాలో కూడా కొత్త స్టైల్ తీసుకొస్తారేమో చూడాలి. ఇకపోతే త్రివిక్రమ్ రామ్ తో తెరకెక్కించబోయే సినిమాకు సుమారు రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.