
'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు వరసగా సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల...వైకుంఠపురములో' నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. మరోపక్క సుకుమార్ తో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ సుకుమార్ సినిమా షూటింగ్ లో డిసెంబర్ నుంచి పాల్గొనాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ దానికి త్రివిక్రమ్ ఒప్పుకోవడంలేదట. అల..వైకుంఠపురములో షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో అది పూర్తయ్యేవరకు లుక్ మార్చుకోవడానికి వీల్లేదని చెప్పాడట. ఈ షూటింగ్ పూర్తి అవ్వడానికి ఎంతలేదన్న రెండు మూడు వారాలు పడుతుందట. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలి. కాబట్టి మొత్తంగా చూసుకుంటే సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే జనవరి నెలాఖరు వరకు ఆగాల్సిందే.