
టీఆరెస్ మంత్రి ఈటల రాజేందర్ ఆ మధ్య చేసిన పలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను పార్టీలోకి మధ్యలో రాలేదని, బతికొచ్చినోన్నీ కాదని ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడనని అన్నారు. ప్రాణాలు పోతున్న చివరి నిమిషంలో కూడా గులాబీ జెండాను వదలలేదని వ్యాఖ్యానించారు. తనను చంపాలనే ప్రయత్నాలు కూడా జరిగాయని ఆరోపించారు. ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని ఈటల గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన పార్టీ మరతారనే ప్రచారం జోరుగా మొదలైంది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందని...అందులో ఈటలకు వేటు పడితే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాలకు చెక్ పెడ్తూ తాజా ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈటల. తాను టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు మంత్రి.