
కరోనా మహమ్మారి అందరి జీవితాలని అతలాకుతలం చేసిందన్న మాట వాస్తవం. ఇక చిత్ర పరిశ్రమకు అయితే పెద్ద దెబ్బె పడింది. మళ్ళీ సుమారు సంవత్సరం తర్వాత అన్ని మెల్లిమెల్లిగా మాములు పరిస్థితికి రావటంతో సినిమాలు వరుసపెట్టి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే పలు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వగా వచ్చే రెండు మూడు నెలల్లో మరిన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈనేపథ్యంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న రిలీజ్ అవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే అదే రోజున నాని నటిస్తున్న 'టక్ జగదీశ్' కూడా రిలీజ్ కు సిద్ధమైంది. కానీ లవ్ స్టోరీ కూడా అదే రోజున వస్తుండటంతో టక్ జగదీశ్ రేస్ నుండి తప్పుకొని 23న వచ్చేందుకు రెడీ అయింది. అప్పుడే రెండు సినిమాలకు న్యాయం జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.