
ఐదేళ్ల క్రిందట సస్పెన్స్ థ్రిల్లర్ "కార్తికేయ" తో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు చెందు మొండేటి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, కలర్స్ స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన కార్తికేయ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజయాన్ని చూసిన టీం సిక్వెల్ తియ్యాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే "కార్తికేయ2" ప్రి ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి. సినీ సిరికిల్స్ లో సమాచారం మేరకు కార్తికేయ2 కోసం మళ్ళీ కలర్స్ స్వాతిని తీసుకున్నారట. అయితే ఆమె పాత్ర ఎంటన్నది కూడా రివీల్ అయింది. టీవీ రిపోర్టర్ గా ముఖ్య పాత్రలో స్వాతి కనిపించబోతుందట. చెందు మొండేటి మొదటి భాగాన్ని ఎక్కడైతే అపాడో అక్కడి నుంచే సినిమా మొదలుపెట్టనున్నాడట. అంటే సుబ్రమణ్యపురం అనే ఊరుతోనే కధ మొదలవుతుంది. మరోపక్క కేవలం కలర్స్ స్వాతినే కాక మొదటి భాగంలో ఉన్న నటి నటులందరూ రెండోవ భాగంలో ఉంటారని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగులోనే కాక హిందీ, మలయాళంలోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.