
ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడానికి తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఎప్పుడు ముందుంటారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ మూవీకి "కాతు వాకులా రేండు కదల్" అని పేరు పెట్టారు. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ను త్వరలో ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలో తాజా అప్డేట్ ప్రకారం, విజయ్ సేతుపతి నటించబోయే చిత్రంలో సమంత అక్కినేనిని కథానాయికగా మేకర్స్ ఎంపిక చేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఏ విధమైన పాత్ర అయుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత అక్కినేని మొదట భాగంలో విజయ్ తో జతకట్టనుండగా, రెండో భాగంలో మరో కథానాయికగా సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సమంత, నయనతార సినిమాలో భాగమైనది లేంది తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.