
మాస్ మసాలా సినిమాలను అందించడంలో దిట్ట అయిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో నటసింహం నందమూరి బాలకృష్ణ చేతులు కలిపారు. వారి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు- సింహా మరియు లెజెండ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఈ రాబోయే చిత్రం హ్యాట్రిక్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఇద్దరు నటీమణులు ఉంటారు. బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు శ్రీయ శరణ్‌లు మహిళా కథానాయికలుగా పోషిస్తే బాగుంటుందని మేకర్స్ బావిస్తున్నారు. గతంలో నయనతార 'సింహా', 'జై సింహా' లో బాలకృష్ణ సరసన నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. మరోవైపు, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన క్రిష్ దర్శకత్వం వహించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో శ్రీయ శరణ్ బాలకృష్ణతో కలిసి నటించింది. శ్రీయ బాలయ్యతో 'పైసా వాసూల్' లో కూడా కనిపించింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు ముందుగుమ్మలు బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్నారు.