
తెలుగు సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక దాని తర్వాత ఒకటి తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆత్మహత్య చేసుకుని మరణించిన హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. "చిత్రం" సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ ఎన్నో మంచి సినిమాల్లో నటించాడు. అప్పట్లో యూత్ ఫెవరేట్ హీరో ఉదయ్ కిరణ్. ఆ తరువాత కొన్నాళ్లకు అవకాశాలు తగ్గేసరికి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ పతనానికి పరోక్షంగా ఒక బడా స్టార్ హీరో కారణం అని ఎన్నో పుకార్లు వినిపించాయి. ఆ పుకార్లపై పలు సినీ ప్రముఖులు స్పందించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో నటించేందుకు యంగ్ హీరో సందీప్ కిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో చిత్రం రేగులర్ షూటింగ్ మొదలు కానుంది.