
ఒక్కసారిగా ఉల్లి ధరలు ఆకాశనంటుతున్న సంగతి తెలిసిందే. దేశమంతా ఉల్లి ధరలు కిలో రూ.50 దాటేసి ఇప్పుడు 100 వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. జనం ఉల్లి కొనుకోవాలంటే హడలిపోతున్నారు. తెలంగాణలో కిలో రూ.40 నుండి రూ.50 వరకు పలుకుతుంది. ఈ క్రమంలో జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి కిలో రూ.25కే ఇస్తానంటూ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏపీలోని అన్ని రైతు బజార్లలో ఈ విక్రమ ప్రక్రయను అమల్లోకి తెచ్చారు. దాంతో ప్రజలు క్యూలుకట్టారు. అయితే దీనిపై టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ తనదైన రీతిలో సైటర్ వేశారు. "జగన్ గారి ప్రభుత్వం అద్భుతమైన పనితీరు కారణంగా ఉల్లి ధర వందకు చేరింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రాల్లో రేషన్ కార్డు ఉంటే కానీ ఉల్లి ఇవ్వం, ఆధార్ కార్డు ఉంటే కానీ ఉల్లి ఇవ్వం అని అడ్డమైన రూల్స్పెట్టడం దారుణం జగన్ గారు" అంటూ పోస్ట్ చేసారు. అయితే ఏపీ రైతు బజార్లలో ఉల్లి విక్రయించేందుకు రోజుకు 150 టన్నులని కర్నూల్ జిల్లా నుండి కొనుగోలు చేస్తుంది.